లెనిన్‌ విగ్రహం ధ్వంసం తగదు | - | Sakshi
Sakshi News home page

లెనిన్‌ విగ్రహం ధ్వంసం తగదు

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

రాయచూరు రూరల్‌: పశ్చిమ బెంగాల్‌లో లెనిన్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తగదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్‌) డిమాండ్‌ చేసింది. శనివారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు భీమయ్య మాట్లాడుతూ ముర్షిదాబాద్‌ జిల్లా జియగంజ జిల్లాలో కమ్యూనిస్ట్‌ నాయకుడు లెనిన్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తగదన్నారు. బీజేపీ గోముఖవ్యాఘ్రంగా మారడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో హింస అధికమైందని, శాంతి స్థాపనకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

నకిలీ రూ.500 నోట్ల చెలామణి బెడద

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లాలో నకిలీ రూ.500 నోట్ల చెలామణి బెడద అధికమైంది. లింగసూగూరులో గత వారం రోజుల నుంచి వివిధ దుకాణాలు, అంగళ్లు, హోటళ్లలో ఇది చాలా హాట్‌ టాపిక్‌గా మారింది. లింగసూగూరులో చోటు చేసుకున్న నకిలీ రూ.500 నోట్ల చెలామణి అంశఽం మరింత చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం సిరవారలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా కొనసాగింది. యూనియన్‌ బ్యాంక్‌ బండిల్‌లో నకిలీ రూ.500 నోట్లు రావడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. నోట్లపై నంబర్‌, స్టిక్కర్‌, మహాత్మా గాంధీ చిత్రం, న్యూఢిల్లీ కోట చిత్రం మాదిరిగానే ఉంటుందనే భావనలో ప్రజలున్నారు. లింగసూగూరు, ిసిరవారల్లో నకిలీ నోట్ల చెలామణితో ప్రజలు సతమతమవుతున్నారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

హొసపేటె: హంపీ చక్రతీర్థ సమీపంలోని కోటిలింగ వద్ద తుంగభద్ర నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభించింది. మత్స్యకారులు, పడవ నడిపేవారు పోలీసులకు సమాచారం అందించారు. అతని వద్ద లభించిన ఆధార్‌ కార్డులో పూజారి పంపపోతప్ప అని ఉంది. ఘటనపై హంపీ పర్యాటక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement