లోకాయుక్త పంజా | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్త పంజా

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

సీఐ వీరణ్ణ

దొడ్డమని

గ్రామ లెక్కాధికారి శివ కుమార్‌

రాయచూరు రూరల్‌/హుబ్లీ: లోకాయుక్త అధికారులు శుక్రవారం పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి యాదగిరి, బీదర్‌ జిల్లాల్లో దాడులు చేశారు. యాదగిరి జిల్లా గురుమఠకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ వీరణ్ణ దొడ్డమని రూ.లక్ష లంచం తీసుకుంటుండగా లోకాయుక్త డీఎస్పీ జాకీర్‌ ఇనాందార్‌ పట్టుకున్నారు. గోపాలపురలో ఆనంద్‌ అనే వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఆ కేసులో నుంచి అతని పేరును తొలగించడానికి లంచం డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో బీదర్‌ జిల్లాలో ఓ డాబాలో లంచం తీసుకుంటున్న గ్రామ లెక్కాధికారిపై లోకాయుక్త అధికారులు దాడి చేశారు. మరకందిన్ని గ్రామ లెక్కాధికారి శివకుమార్‌ ఇంటి పత్రాలను మ్యుటేషన్‌ చేసి ఇచ్చేందుకోసం రూ.5 లక్షలు డిమాండ్‌ చేయగా, మహదేవ్‌ శాంతప్ప నుంచి ముందస్తుగా రూ.2.50 లక్షలు లంచం స్వీకరిస్తున్న సమయంలో లోకాయుక్త డీఎస్పీ హనుమంతరాయ, అధికారులు దాడి చేసి శివకుమార్‌తో పాటు అతనికి సహకరించిన శరణయ్యను అరెస్ట్‌ చేశారు.

యాదగిరి, బీదర్‌ జిల్లాల్లో

అధికారుల దాడులు

వలలో చిక్కిన గురుమఠకల్‌

సీఐపై కేసు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement