రాయచూరు రూరల్: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త ఇంటికే కన్నం వేసి నగలు చోరీ చేసుకుని ప్రియుడితో పారిపోడానికి సిద్ధమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా హొసకోటెలో జరిగింది. భర్త దిల్‌షాన్ నదాఫ్, భార్య హసీనా నదాఫ్‌లకు రెండు నెలల క్రితం వివాహమైంది. హసీనా హనుమంతు అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్‌లైనా కూడా ప్రేమికుడిని వదలడానికి ఇష్టం లేకపోవడంతో భర్త ఇంటిలో చోరీకి పాల్పడిన హసీనా 154.6 గ్రాముల బంగారు, 45 గ్రాముల వెండి ఆభరణాలను దొంగలించుకొని పరారైంది. ఈ విషయాన్ని భర్త దిల్‌షాన్ నదాఫ్ రామదుర్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల్లో వారిద్దరిని అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ఆభరణాల విలువ దాదాపు రూ.21 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు.
హసీనా నదాఫ్
హనుమంతు
బంగారు, వెండి ఆభరణాల చోరీ
ప్రియుడితో కలిసి పరారీకి కుట్ర


