జేఎంఎం పనుల్లో కొరవడిన నాణ్యత | - | Sakshi
Sakshi News home page

జేఎంఎం పనుల్లో కొరవడిన నాణ్యత

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

కోలారు: జలజీవన్‌ మిషన్‌ (జేఎంఎం) పనులను నాణ్యత లేకుండా చేశారని తాలూకాలోని విట్టప్పనహళ్లి గ్రామస్తులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపిస్తూ గ్రామస్తులు రెండు రోజుల క్రితం పనులను పూర్తిగా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పనులను పరిశీలన చేయడానికి శుక్రవారం గ్రామానికి ఏఈఈ జబీవుల్లా, ఇంజినీర్‌ అరవింద్‌, కాంట్రాక్టర్‌లు విచ్చేశారు. ఈ సందర్భంగా పనులలో జరిగిన లోపాలను గ్రామస్తులు అధికారులకు చూపించారు. పరిశీలన చేయకుండానే అంతా సక్రమంగా ఉందని క్లీన్‌ చిట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణంలోను నాణ్యత కనపరచ లేదని ఆరోపించారు. ఏఈఈ పరిశీలన తమకు సంతృప్తిని కలిగించలేదని, ఉన్నతాధికారులు వచ్చి పరిశీలన చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

మండిపడిన గ్రామస్తులు

Advertisement
 
Advertisement
Advertisement