ఎదురెదురుగా ఢీకొన్న కార్లు: ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా ఢీకొన్న కార్లు: ఇద్దరు మృతి

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

దావణగెరె జిల్లాలో ఘోరం

సాక్షి బళ్లారి: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం దావణగెరి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దావణగెరె జిల్లాకు చెందిన గౌతమ్‌ (29), మనోజ్‌ (29) మృతులు. వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. రెండు కార్లు వేగంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement