ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

కేజీఎఫ్‌: ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించేందుకు ఏర్పాటు చేసిన టాస్కు ఫోర్సు బృందం శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి దాదాపు 130 కిలోల ప్లాస్టిక్‌ను సీజ్‌ చేశారు. నగరసభ కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌తో వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధానికి సహకరించాలన్నారు ప్లాస్టిక్‌ కనిపిస్తే దుకాణం లెసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు.

కౌశల్యాలను

పెంపొందించుకోవాలి

కోలారు: ఇంజినీర్లు సామాజిక సమస్యలకు స్పందించేలా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఆర్‌.రవి తెలిపారు. నగర సమీపంలోని సి భైరేగౌడ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంల ఆయన పాల్గొని విద్యార్థులకు పదవీ ప్రమాణ పత్రాలు అందజేసి మాట్లాడారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే కౌశల్యాలను విద్యార్థులు అలవర్చుకోవాలలన్నారు. కళాశాల కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, ప్రొఫెసర్‌ ఈశ్వర్‌, డాక్టర్‌ అప్రమేయన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement