బనశంకరి: బెంగళూరు యలహంకలో పుష్ప పల్లకీ వైభవం మిన్నంటింది. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పల్లకీ వాహనాల ఊరేగింపు నేత్రపర్వం గావించింది. గ్రామదేవత మహేశ్వరమ్మ పూల కరగ మహోత్సం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యలహంక బజార్‌రోడ్డులో వెలసిన శ్రీమహేశ్వరమ్మ కరగ వేడుక బుధవారం అర్ధరాత్రి ఆరంబమైంది. భక్తజనవాహిని మధ్య కరగ, పుష్ప పల్లకీలు ఊరేగింపు సాగింది. ఎమ్మెల్యే ఎస్‌ఆర్.విశ్వనాథ్ కరగ ను దర్శించుకుని పూజలు చేశారు. 24 గ్రామ దేవతల పూల పల్లకీలు ట్రాక్టర్లు, వాహనాలలో ఊరేగింపు రమణీయంగా సాగింది. వేలాదిగా ప్రజలు దర్శించుకున్నారు.
యలహంకలో మహేశ్వరమ్మ జాతర


