ఐపీఎస్ రామచంద్రరావు సస్పెన్షన్ రద్దుపై స్పందిస్తూ, సీఎం అనుమతి తీసుకొని రద్దు చేశారు, ఈ నెలాఖరులో ఆయన రిటైరవుతారు, పెన్షన్ సెటిల్మెంటు తదితరాలు ఉన్నాయని, సస్పెన్షన్ ఎత్తేయాలని రామచంద్రరావు సీఎంకు విన్నవించారు, కావాలంటే తరువాత విచారణను కొనసాగించవచ్చని అభ్యర్థించారు అని తెలిపారు.
వరుసగా వాహనాల ఢీ, 10 మందికి గాయాలు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు– తుమకూరు హైవేలో వరుసగా వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. గురువారం దాబస్‌పేట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ బస్సు, రెండు కార్లు, ఒక బైక్, ఒక లారీ, బొలెరో జీప్ వరుసగా ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు అదుపు చేయలేక ఢీకొట్టుకున్నాయి. దీంతో ఆ వాహనాలు ధ్వంసం కాగా, 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ సంఘటనతో కిలోమీటర్ల మేర గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు అతి కష్టం మీద ట్రాఫిక్‌ను సరిచేశారు.


