ఉపాధి కరువు.. వలస దరువు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కరువు.. వలస దరువు

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర నగరాలకు వలసలు వెళుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్‌, కలబుర్గి జిల్లాల్లో రబీలో కూడా కరువు నెలకొంది. వ్యవసాయ కూలీలకు పనులు లభించక బతుకు తెరువు కోసం బెంగళూరు, ముంబై, సోలాపూర్‌, గోవా, చైన్నె, హైదరాబాద్‌లకు వలస వెళుతున్నారు. వానలు లేక పంటలు పండక పోవడంతో జీవనోపాధి కరువై వలసల కోసం రైతులు మూటా ముల్లే సర్దుకుంటున్నారు. రాయచూరు, యాదగిరి, బీదర్‌, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి రోజు వందలాది మంది బెంగళూరుకు రైలులో ప్రయాణిస్తున్నారు. వారిని కదిలిస్తే కళ్లలో కన్నీరు వస్తాయి. గ్రామాల్లో వయస్సు పైబడిన వారిని వదిలి పిల్లా పాపలతో కట్టుబట్టలతో వలస వెళుతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధులు వలసల నివారణకు ఎలాంటి పథకాలను ప్రారంభించాలనే తపన ఏ ఒక్కరిలో లేకపోవడం విడ్డూరంగా ఉంది. అధికారం కోసం పాకులాడే నేతలు రైతన్నలు పడుతున్న బాధలను పరిష్కరించడంలో మౌనం వహిస్తున్నారు.

రాయచూరులో రైలు ఎక్కుతున్న నిరుద్యోగులు

లగేజీ సర్దుకుని వలస బాట పట్టిన కూలీలు

మూటాముల్లెతో తరలి వెళుతున్న

వ్యవసాయ కూలి కార్మికులు

జీవనోపాధి కోసం సుదూర నగరాలకు వలసబాట పట్టిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement