అద్దమైనా.. అడ్డుకుంటుందని.. | - | Sakshi
Sakshi News home page

అద్దమైనా.. అడ్డుకుంటుందని..

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

మైసూరు: సాంస్కృతిక నగరం మైసూరులో ఇకపై బహిరంగంగా ఎక్కడబడితే అక్క మూత్రవిసర్జన చేయడానికి వీలు లేకుండా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సెంట్రల్‌ బస్టాండ్‌ ఎదుట సుమారు 80 మీటర్ల పొడవైన కాంపౌండ్‌కు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రిఫ్లెక్షన్‌ అద్దాలను ఏర్పాటు చేశారు. దానిముందు నిలుచునే వారు అందరికీ కనిపిస్తారు. దీనివల్ల మూత్ర విసర్జన చేయబోరని అధికారులు చెబుతున్నారు. అద్దాల చుట్టూ ఎల్‌ఈడీ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం నుంచి వేకువ వరకూ ఆ లైట్లు వెలుగుతాయి. జన సంచార స్థలాల్లో మూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారింది. దీన్ని నివారించేందుకు సుమారు రూ. 9.5 లక్షల ఖర్చుతో అద్దాల వ్యవస్థను అమలు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఇక్కడే తొలిసారని, విజయవంతం అయితే ఇతర నగరాలకూ విస్తరించే అవకాశం ఉంది. కాగా, స్టీలు షీట్లను దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం లేకపోలేదు.

బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకట్టకు..

మైసూరులో సరికొత్త ప్రయోగం

Advertisement
 
Advertisement
Advertisement