విరిగిన చెట్లు.. తొలగింపునకు పాట్లు | - | Sakshi
Sakshi News home page

విరిగిన చెట్లు.. తొలగింపునకు పాట్లు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

బుధవారం ఓ వీధిలో చెట్ల తొలగింపు మత్తికెరెలో కరెంటు వైర్ల మరమ్మతులు

బనశంకరి: గత నెల 29న సాయంత్రం కురిసిన భారీ గాలీవానలకు బెంగళూరులో వందలాది చెట్లు కూలిపోయాయి, కొమ్మలు విరిగిపడి కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఆ చెట్ల తొలగింపు ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో కూలిన చెట్లు, కొమ్మలు ఇంకా అలాగే ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కొరత వల్ల ఆలస్యం అవుతున్నట్లు గ్రేటర్‌ బెంగళూరు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రాత్రి సమయంలో చెట్లు తొలగిస్తున్నారు. పాలికె సిబ్బందితో పాటు ప్రైవేటు కూలీలను కూడా నియమించినట్లు చెప్పారు. కేంద్ర, తూర్పు, దక్షిణ నగర పాలికెల పరిధిలో ఎక్కువ చెట్లు కూలాయి. ఇదే రీతిలో తొలగింపు సాగితే పూర్తిగా శుభ్రం చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో అనే సందేహాలున్నాయి.

బెంగళూరులో ప్రజలకు ఇబ్బందులు

Advertisement
 
Advertisement
Advertisement