హొసపేటె: స్థానిక ఎస్‌బీఎన్ బీఈడీ కళాశాలలో బుధవారం కన్నడ సాహిత్య పరిషత్ 112వ వ్యవస్థాపక దినోత్సవం, వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు సన్మానం కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని కన్నడ సంస్కృతి శాఖ సహ సంచాలకులు సిద్ధలింగేష్ కే.రంగన్నవర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన ఉపాధ్యాయులను తయారు చేయడంలో మన సంస్కృతి, సంప్రదాయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కర్ణాటక జానపద అకాడమీ సభ్యులు డాక్టర్ జీవన్ సాబ్, తాలూకా విద్యాధికారి శేఖరప్ప హొరపేటె, కసాప తాలూకా అధ్యక్షుడు డాక్టర్ గుండి మారుతి, కార్యదర్శులు ప్రకాష్, ఉమామహేశ్వర్, డాక్టర్ సురేంద్ర, హంపీ కవి దృశ్య కళా విభాగాధిపతి డాక్టర్ మోహన్, ప్రభుత్వ ప్రమోషన్ హెడ్ మాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.బసవరాజ్, కార్యవర్గ సభ్యులు, కళాశాల పాలన మండలి సభ్యులు, విద్యార్థులు హాజరయ్యారు.


