రైల్వే గేట్‌ వద్ద గ్రీన్‌మ్యాట్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రైల్వే గేట్‌ వద్ద గ్రీన్‌మ్యాట్‌ ఏర్పాటు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

బళ్లారిఅర్బన్‌: తీవ్రమైన వేసవి ఎండల కారణంగా ప్రతి రోజూ వందలాది మంది వాహనదారులు నగరంలోని కంటోన్మెంట్‌ రైల్వే గేటు వద్ద మండుటెండలో రైలు వెళ్లేంత వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను గమనించిన మాజీ మేయర్‌, కార్పొరేటర్‌ ఎం.రాజేశ్వరి సుబ్బరాయుడు తక్షణం చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ఆమె అభ్యర్థనపై స్పందించిన అధికారులు వెంటనే గ్రీన్‌ మ్యాట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులకు నీడ రూపంలో ఎండల నుంచి ఉపశమనం లభించింది. కాగా బుధవారం రాజేశ్వరి గ్రీన్‌మ్యాట్‌ను పరిశీలించారు. యువ నాయకుడు యోగానంద రెడ్డి, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement