హొసపేటె: పొగాకు వాడకం ఒక ప్రాణాంతక వ్యసనమని జిల్లా ఆరోగ్యాధికారి ఎం.ధర్మనగౌడ అన్నారు. హగరిబొమ్మనహళ్లిలోని తిమ్మయ్య శెట్టి ఐటీఐ కళాశాలలో బుధవారం పొగాకు వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పొగాకు వాడకం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమవుతోందన్నారు. ఈ వ్యవసం నుంచి యువతను రక్షించడంలోనూ, సమాజంలో అవగాహన కల్పించడంలోనూ విద్యార్థుల పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. పొగాకు రహిత సమాజ నిర్మాణంలో వారు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. పాఠశాల, కళాశాల ప్రాంగణాలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిషేధించినట్లు ఆయన తెలిపారు. తాలూకా ఆరోగ్య విద్యా అధికారి యమునవ్వ, కళాశాల ప్రధానోపాధ్యాయ విభాగం తరపున పాల్ రేణుక ప్రసాద్, ఆరోగ్య శాఖ సిబ్బంది, విద్యార్థులు, జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సామాజిక కార్యకర్త బోజరాజు పాల్గొన్నారు.


