బెంగళూరుతో పాటు జిల్లాలకు వర్షసూచన | - | Sakshi
Sakshi News home page

బెంగళూరుతో పాటు జిల్లాలకు వర్షసూచన

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

బనశంకరి: భరించలేని వేసవి ఎండల మధ్య వాన హెచ్చరికలు వచ్చాయి. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సుమారు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారముంది. దీంతో బెంగళూరు, రూరల్‌తో పాటు 13 జిల్లాల్లో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. చిక్కబళ్లాపుర, రామనగర, మండ్య, మైసూరు, చామరాజనగర, కొడగు, కోలారు, బెళగావి, ధార్వాడకు అలర్ట్‌ వచ్చింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మంగళవారం సాయంత్రం బెంగళూరులో పలుచోట్ల జల్లు వర్షం కురిసింది. బెళగావి నగరంలో జోరువాన పడడంతో రోడ్లు జలమయం అయ్యాయి.

నగరంలో జల్లులు, బెళగావిలో వర్షం

Advertisement
 
Advertisement
Advertisement