టెన్నిస్‌ టోర్నీ షురూ | - | Sakshi
Sakshi News home page

టెన్నిస్‌ టోర్నీ షురూ

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

తుమకూరు: కల్పతరునాడు తుమకూరు నగరంలో ఐటీఎఫ్‌డబ్ల్యూ–35 ర్యాంకింగ్‌ తుమకూరు మహిళా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీకి మంగళవారం లాంఛనంగా శ్రీకారం చుట్టారు. తుమకూరు విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించిన టెన్నిస్‌ కోర్టు ఈ టోర్నీకి వేదికైంది. హోంమంత్రి జీ.పరమేశ్వర్‌, టోర్నీ ప్రముఖులు, జిల్లాధికారి, ఎమ్మెల్యేలు బెలూన్లను ఎగరేయడం ద్వారా నాంది పలికారు. కన్నికా పరమేశ్వర్‌, ఎమ్మెల్యేలు సురేష్‌గౌడ, జ్యోతిగణేష్‌, సురేష్‌బాబు, గోవిందరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్‌లలో పలువురు క్రీడాకారిణులు తలపడగా, పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement