పాత టైర్లతో మొక్కల పెంపకం | - | Sakshi
Sakshi News home page

పాత టైర్లతో మొక్కల పెంపకం

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

రాయచూరు రూరల్‌: వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు కొప్పళ నగరసభ ఒక అడుగు ముందుకేసింది. నగరంలో చెత్తను పారవేసే చోట మినీ ఉద్యానవనాల ఏర్పాటుకు సిద్ధమైంది. చెత్తను పారవేసిన వారిపై జరిమానాలు విధించినా ప్రజలు తీరు మారకపోవడంతో దీని నియంత్రణకు కొప్పళ నగరసభ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాతబడిన టైర్లకు రంగులు వేసి వాటిని రక్షణగా పెట్టి మొక్కలు నాటారు. నగర సౌందర్యం పెంపొందించడానికి కొత్త మార్గాలు వెతికారు. బీజేపీ మాజీ నగరసభ సభ్యురాలు దివ్యా అగ్ని స్వచ్ఛత, పరిసరాల సంరక్షణకు ముందుకు రాగా, ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.

కొప్పళలో వినూత్న ప్రయోగం

Advertisement
 
Advertisement
Advertisement