బాగల్‌కోటె బీజేపీదే అనుకున్నాం | - | Sakshi
Sakshi News home page

బాగల్‌కోటె బీజేపీదే అనుకున్నాం

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

బనశంకరి: బాగల్‌కోటెలో తమ ఓటమిని ఊహించలేదని, ఇకపై పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర తెలిపారు. సోమవారం మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దావణగెరె దక్షిణ, బాగల్‌కోటెలో తమ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, బాగల్‌కోటెలో ఇలా అవుతుందని అనుకోలేదన్నారు. బాగల్‌కోటేలో సీఎం సిద్దరామయ్య 15 రోజులు మకాం పెట్టారని, మంత్రులు కూడా ఇక్కడే తిష్ట వేశారని అన్నారు. కాగా, పశ్చిమబెంగాల్‌, అస్సోం, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వానికి శక్తి నింపిందని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ అధికార మదంతో హిందువులకు అన్యాయం చేశారని, అందుకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. బీజేపీ పక్షనేత ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ.. దావణగెరె దక్షిణలో గెలుస్తామనుకున్నారు. మూడు రాష్ట్రాల్లో గెలుపు సందర్భంగా నేతలు మిక్చర్‌ పంచి సంబరాలు నిర్వహించారు.

బీజేపీ సారథి విజయేంద్ర

Advertisement
 
Advertisement
Advertisement