కోలారు: రాష్ట్రంలో జరిగిన దావణగెరె, బాగలకోటె ఉప ఎన్నికలు, కేరళ రాష్ట్రంలో ఘన విజయం సాధించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు టపాసులుకాల్చి స్వీట్లు పంచి విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పంచ గ్యారెంటీలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కారణమన్నారు. ఉప ఎన్నికల్లో విజయం ప్రజలు కాంగ్రెస్ పార్టీపై మరింతగా విశ్వాసం ఉంచారనేందుకు నిదర్శనమన్నారు. కేరళలో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బలోపేతానికి నిదర్శనమన్నారు. నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు ఎస్‌ఆర్ మురళీగౌడ, లాల్ బహద్దూర్ శాస్త్రి, నాగరాజ్, శ్రీనివాస్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.


