ఘనంగా పడుబిద్రి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పడుబిద్రి రథోత్సవం

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

బొమ్మనహళ్లి: ఉడుపి జిల్లా పడుబిద్రిలో పునర్నిర్మించిన మహాలింగేశ్వర మహాగణపతి ఆలయంలో స్వామివారి బ్రహ్మకుంభాభిషేకం, రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ పూజలు, యాగాలు సాగాయి. ఆదివారం ఉదయం శుభ ముహూర్తంలో బ్రహ్మ కుంభాభిషేకం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వేలాది మంది భక్తుల మధ్య తేరు సంబరం జరిగింది.

ఘరానా జ్యోతిష్యుల గుట్టురట్టు

మహిళలకు వేధింపులు

దొడ్డబళ్లాపురం: మహిళలను వేధిస్తున్న ఇద్దరు జ్యోతిష్యుల గుట్టు రట్టయింది. పూజల పేరుతో ఒక జ్యోతిష్యుడు తనపై అత్యాచారం చేస్తున్నట్లు ఓ బ్యూటీషియన్‌ బెంగళూరులోని సీకే అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాధితురాలు రాజాజీనగరలో బ్యూటీషియన్‌ శిక్షణనిస్తోంది. మోహన్‌కుమార్‌ అనే జ్యోతిష్యుడు ఆమెకు పరిచయమయ్యాడు. సంపాదన పెరగడానికి తాను ప్రత్యేక పూజలు, యాగాలు చేయిస్తానని నమ్మించి రామనగరలోని పిరమిడ్‌ వ్యాలీ సహా పలుచోట్లకు తీసుకువెళ్లి అత్యాచారాలు చేశాడు. ఎవరికై నా చెబితే ఇంట్లో అందరినీ చంపేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. నిందితుడు మోహన్‌ కుమార్‌ పరారీలో ఉన్నాడు.

నగ్నంలో పూజల్లో పాల్గొనాలని..

నగ్నంగా పూజల్లో పాల్గొంటే రూ.30 లక్షలు ఇస్తానని ఒక జ్యోతిష్యుడు తనను వేధిస్తున్నాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రామనగర తాలూకా దొడ్డమణ్ణుగుడ్డె గ్రామంలో వెలుగు చూసింది. కిరణ్‌ అనే జ్యోతిష్యుడు గత కొన్ని రోజులుగా రాత్రి పూట మెసేజ్‌లు పంపిస్తున్నాడు, డబ్బులు రెట్టింపు చేసే పూజలో నువ్వు నగ్నంగా కూర్చున్నా, లేదా నీ నగ్న ఫోటోలు పంపించినా పూజలు ఫలిస్తాయని, ఇందుకు సహకరిస్తే రూ.30 లక్షలు ఇస్తానని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కమనీయం.. కరగోత్సవం

బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ జిల్లాలోని కనకపుర ధర్మరాయస్వామి, ద్రౌపతమ్మ కరగ మహోత్సవం శనివారం రాత్రి కనులపండువగా జరిగింది. అర్ధరాత్రి దేవీ దేవతలకు పుష్పాలతో అలంకరించి, నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణం నుంచి ధర్మరాయస్వామి, ఆదిశక్తి ద్రౌపతమ్మ దేవి పుష్పోత్సవం ప్రారంభమైంది. కరగ పూజారి మల్లెలతో అలంకరించిన కరగను ఎత్తుకుని నాట్యమాడుతూ ఊరంతా సంచరించారు.

శృంగేరిలో కుట్రల్ని తిప్పికొట్టాం: డీసీఎం

శివాజీనగర: శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌లపై కుట్రను తిప్పికొట్టినట్లు డీసీఎం డీకే శివకుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నేను రాత్రంతా ఓట్ల లెక్కింపు పరిణామాలను గమనించాను. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జీవరాజ్‌, అధికారులను ఏ విధంగా దుర్వినియోగం చేసుకొన్నారనేది దేశానికి పెద్ద సాక్షి అయిందన్నారు ఆ నివేదిక వచ్చిందని, దానిని అధ్యయనం చేస్తున్నానన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు ఉన్న బాక్స్‌లను ఓపెన్‌ చేయడం నుంచి అన్నీ తనకు తెలుసని జీవరాజ్‌పై మండిపడ్డారు. గతంలో వారి ఏజెంట్‌ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిగింది, సంతకాలు కూడా తీసుకున్నారు, ఇప్పుడు జీవరాజ్‌ రచ్చ చేశారని ధ్వజమెత్తారు. జీవరాజ్‌పై న్యాయ పోరాటం చేపట్టామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement