కుల వివక్షకు తావులేని రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కుల వివక్షకు తావులేని రథోత్సవం

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

మైసూరు: జిల్లాలోని హుణసూరులో బ్రాహ్మణ వీధిలో ఉన్న పురాతన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథోత్సవం కుల భావాలు లేకుండా సాగింది. బ్రాహ్మణులు, దళిత నేతలను అతిథులుగా ఆహ్వానించి వేడుక సాగించారు. డీఎస్‌ఎస్‌ రాష్ట్ర నేత నింగరాజు మల్లాడి మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవానికి దళిత నాయకులను ఊరేగింపుగా తీసుకువెళ్లి, రథాన్ని లాగడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది అని అన్నారు. దళిత నాయకులు చిక్కహున్సూర్‌ రాజు, బల్లేనహళ్లి కెంపరాజు, కిరిజాజీ గజేంద్ర, బెల్తూరు వెంకటేష్‌, నాగనహళ్లి మాదేవ, బన్నిబీడి శ్రీధర్‌, రేణుకమ్మ తదితరులు, బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement