ఉపాధ్యాయుల సంఘం ఎన్నికల్లో విజయ భేరి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సంఘం ఎన్నికల్లో విజయ భేరి

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

కోలారు: జిల్లా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సురేష్‌ బాబు, నారాయణ స్వామి, అనిల్‌ కుమార్‌ వర్గానికి చెందిన అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలుపొందారు. ప్రస్తుత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ వర్గం ఓటమి పాలైంది. ఎన్నిక జరిగిన 20 స్థానాలను అనిల్‌ కుమర్‌ వర్గానికి చెందిన వారు కై వసం చేసుకున్నారు. అన్ని స్థానాల్లో విజయం సాధించడంపై నారాయణ స్వామి, అనిల్‌ కుమార్‌, సురేష్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పని చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement