యుద్ధప్రాతిపదికన డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తి | - | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తి

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కొప్పళలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్‌ నాటికి క్రస్‌ గేట్లు అమర్చే పనులను పూర్తి చేశామన్నారు. డ్యాం గేట్లు, ఇతర పనులకు రూ.315 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రూ.54 కోట్లను క్రస్ట్‌ గేట్లకు కేటాయించడం జరగిందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొని అనుకున్న సమయానికి పనులు పూర్తయినట్లు వెల్లడించారు. 22వ గేట్‌ వద్ద కొత్త చైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నవలి వద్ద సమానంతర జలశయం నిర్మాణం కోసం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాలెన్సింగ్‌ రిజర్యాయర్‌ నిర్మాణానికి విముఖత వ్యక్తం చేస్తున్నారనారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 10 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నట్లు వివరించారు. 33 టీయంసీల మేర పూడికతీత విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

తుంగభద్ర డ్యాం పరిశీలన

హొసపేటె: తుంగభద్ర డ్యాం గేట్‌ ఏర్పాటు పనులను ఆదివారం ఉప ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల నివేదిక ప్రకారం పాత గొలుసులు బలంగానే ఉన్నప్పటికి.. ముందు జాగ్రత్త చర్యలు కొత్త గొలుసులు అమర్చాలని నిర్ణయించామన్నారు. పూడికతీత సమయంలో రైతుల భూములు, పర్యావరణానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్‌ పరిసరాల్లోని పరిశ్రమల నుంచి రసాయనాలతో కూడిన నీరు డ్యామ్‌లోకి ప్రవేశిస్తున్నట్లు నివేదికలు వచ్చాయన్నారు. అధికారుల నుంచి సమాచారం అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి ముఖ్యమే అయినా, ప్రజల ఆరోగ్యం, పంటల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. జలాశయం మొత్తం 33 గేట్ల సంస్థాపన పనులు పూర్తయ్యాయని, సాంకేతిక బృందం సలహా మేరకు ఆధునీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలియజేశారు. పనులు పూర్తయిన తర్వాత, రాయచూర్‌, బళ్లారితో సహా నాలుగు జిల్లాల రైతులను ఆహ్వానించి డ్యామ్‌కు ప్రతేక్య పూజ చేస్తామని పేర్కొన్నారు.

ఇందుకోసం రూ.315 కోట్ల వ్యయం

డీసీఎం డి.కె.కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement