రాయచూరు రూరల్: రైతుల సంక్షేమమే సర్కార్ ప్రధాన లక్ష్యమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అభిప్రాయ పడ్డారు. విజయపురలో లోహగ్రాం, బరట్, అరికెరె, హంచినాళ పరిధిలోని 14 గ్రామాల రైతులకు నీటి సౌకర్యం కోసం రూ.17 కోట్లతో చెరువుల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఆర్థికంగా రైతులు స్వావలంబన సాధించాలన్నారు. బోరుబావుల ద్వారా పంటలు పండించే రైతులు భూగర్భ జలాల వృద్ధికి కృషి చేయాలన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల రైతుల మరింత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.


