బనశంకరి: బెంగళూరు నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగర రోడ్లు జలమయంగా మారగా విధులు ముగించుకుని ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులు, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వసంతనగర, సిటీమార్కెట్, మెజెస్టిక్, శాంతినగర, జయనగర, జేపీ నగర, బనశంకరి, కోణనకుంటె, హెబ్బాళ, యలహంక, సదాశివనగర, రాజాజీనగర, విజయనగర, చంద్రా లేఔట్, ఇందిరానగర, లగ్గెరె, నందిని లేఔట్, ఆడుగోడి, కోరమంగల, కార్పొరేషన్, మహాలక్ష్మీ లేఔట్, సుబ్రమణ్యనగర, నాగరబావి, మూడలపాళ్య, గిరినగర, బసవనగుడి, మల్లేశ్వరం, ఎంజీ రోడ్డు, కమర్షియల్‌స్ట్రీట్, శివాజీనగర తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫ్రీడంపార్కు వద్ద శేషాద్రిపురం రోడ్డు జలమయం కావడంతో వాహనాలు నీటిలో సంచరించాయి. కేఆర్ మార్కెట్ వద్ద కూడా వర్షంతో మినీచెరువుగా మారింది. ఎస్పీ రోడ్డు తదితర రోడ్లు వర్షం నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


