రాయచూరు రూరల్: హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పోలీస్ కమిషనర్ శరణప్ప తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ క్రైమ్, ఇతర నేరాలపై జాగ్రతి, నేరాల నియంత్రణకు అందరు సహకరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాల నియంత్రణ కోసం నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలో 58 చోట్ల 158 ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. సీటు బెల్ట్ ధరించకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదన్నారు. మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలను వేగంగా నడిపితే జరిమానా విధిస్తామన్నారు. సంచార నియమాల ఉల్లంఘన, ట్రిపుల్ డ్రైవింగ్‌కు అవకాశాలు లేవన్నారు.


