రాయచూరు రూరల్: బుద్ధ గయంలోని బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానం పొందిన మహా మానవతా వాది గౌతమ బుద్ధుడు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ హంపన్న సూచించారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో బుద్ధుడి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మానవుడు అరిషడ్ వర్గాలను త్యజించి జీవనం కొనసాగించాలన్నారు. కోరికలను అదుపులో పెట్టుకుని ప్రశాంత వాతావారణంలో జీవించాలని తెలిపారు. అంతకు ముందు బుద్దుడి విగ్రహానికి జిల్లా అధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబీన్ మోహపాత్రో, నరసింహలు, శ్రీనివాసులు తదితరులు పూజలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమార స్వామి, నగర సభ కమిషనర్ శరణప్ప, తహసీల్దార్ సురేష్ వర్మ, తిమ్మారెడ్డి, గౌతం తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభావంతులకు సన్మానం
బళ్లారి అర్బన్: దేవనామ ప్రియ బయలు బుద్ధ వివార ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగనకల్లు బుద్ధవరంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. 2025–26 సంవత్సరంలో జరిగిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో సత్తా చాటిన త్రిష, కస్తూరి, ఆశాబి, కామాక్షి, నబి రసూల్, తనుజ, వంశీ, శ్వేత, భాగ్య, చందన, వచన ప్రియ, గిరిసాయి, నాగవేణి తదితరులను సన్మానించారు. అలాగే ద్వితీయ పీయూసీలో మంచి మార్కులు సాధించిన ఉమాదేవి, దీక్షితను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలను సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో కప్పగల్ ఓంకారప్ప, బళ్లారి మహనగర పాలికె సంస్థ మేయర్ గాదెప్ప, పన్నరాజ్, సంగనకల్లు విజయ్‌కుమార్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు మెహతాబ్, హెచ్‌ఎం.బాబుసాబ్, ఉపాధ్యాయులు ధర్మణ్ణ, శివశంకర్, చలవాద మహాసభ అధ్యక్షుడు గోవిందరాజ్ నాగరికరి, నరసప్ప, నాగరత్న, బీ.నాగరాజ్, లింగప్ప, శంకర్, హొనూరప్ప తదితరులు పాల్గొన్నారు.


