రాయచూరు రూరల్: మంత్రాలయం మఠంలో గురువారం లక్ష్మీ నరసింహ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్ అభిషేకం, ప్రత్యేక పూజలు చేపట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు.. ఆలయ ప్రాంగణంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సాక్షి, బళ్లారి: నగరంలోని సత్యనారాయణ పేటలో వెలసిన లక్ష్మీనరసింహా స్వామి దేవాలయంలో గురువారం స్వామి వారి కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి, నారా శైలజా దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేయించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అంతకుముందు అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.


