ఒక్కటైన 30 జంటలు | - | Sakshi
Sakshi News home page

ఒక్కటైన 30 జంటలు

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

బళ్లారి అర్బన్‌: బళ్లారి తాలూకా సిరివార గ్రామ సమీపంలోని అమరేశ్వర ఆలయ ప్రాంగణంలో కన్నడ రక్షణ యువ వేదిక ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. డాక్టర్‌ సి.మునిస్వామి కప్పగల్లు నాయకత్వంలో 30 జంటలు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాయి. శ్రీ రాయర సేవా ట్రస్ట్‌ అధ్యక్షురాలు ఎస్‌.రత్నమ్మ శ్రీధర్‌ 30 జంటలకు మంగళసూత్రాలు పంపిణీ చేశారు. అలాగే కన్నడ రక్షణ యువ వేదిక పదాధికారులు, సభ్యులు, ప్రముఖులు పాల్గొని సేవలందించారు. కార్యక్రమంలో సుశీలమ్మ మునిస్వామి, శృతి, శంకర్‌, కొరిబసవ, ద్యావన్న సిరివర, తిప్పేస్వామి బిసలల్లి, పరశురామప్ప, పూజారి శివప్ప స్వామి తదితరులు పాల్గొన్నారు.

సేవా స్ఫూర్తికి

ఎల్లలు లేవు

హుబ్లీ: సేవా స్పూర్తికి ఎల్లలు ఉండవు. విక్రమ్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తామని ఆ ఫౌండేషన్‌ ప్రముఖుడు విక్రయ్‌ బాయి హామీ ఇచ్చారు. గురువారం స్థానిక పాత హుబ్లీ ప్రియదర్శిని బదిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్నదానం చేశారు. అలాగే ఆశ్రమానికి అవసరమైన వివిధ వస్తువులు వితరణ చేశారు. విక్రమ్‌ బాయిని ఆశ్రమ నిర్వాహకులు సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement