హొసపేటె: తాలూకాలోని కుంచూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నీటి మోటార్‌ను ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒక యువకుడు గురువారం మరణించాడు. మృతుడు ఐరన్ మల్లజ్జ (19) తన ఇంటి సమీపంలో ఉన్న నీటి మోటారును ఆన్ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు దావణగెరెలోని ఆకాంక్ష అకాడమీ కళాశాలలో పీయూసీ చదివాడు. సీఈటీ పరీక్షను కూడా రాసిన అతను.. ఎన్‌ఈఈటీ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈతకెళ్లి
నవ వరుడు మృతి
రాయచూరు రూరల్: వివాహం జరిగిన 15 రోజుల్లోనే నవ వరుడు దుర్మరణం పాలైన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వడిగేరలోని బి.మరాయ మ్యాగేరి (25) మృతుడు. వేసవికాలం కావడంతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు. బి.మరాయ మ్యాగేరి మృతదేహాన్ని చూసిన నవ వధువు రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


