బనశంకరి: సిలికాన్ సిటీని వరుణుడు వణికించాడు. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన ఆకస్మిక గాలీవానకు వందలాది చెట్లు, కరెంటు స్తంభాలు విరిగి, కార్లు, ఆటోలు, బైక్‌లపై పడ్డడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. బౌరింగ్ ఆస్పత్రి పాత ప్రహరీ కూలిపోయి 7 మంది మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది. జడివానకు నగరంలో రోడ్లు చెరువులను తలపించగా అనేక లేఔట్లలో ఇళ్లు, అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీరు చొరబడటంతో ప్రజలను నిద్రలేకుండా చేసింది. రెండుగంటలు పాటు కురిసిన వర్షానికే ఐటీ సిటీ అతలాకుతలమైంది. అండర్‌పాస్‌లలో నీళ్లు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనేకచోట్ల షాపుల్లోకి నీరుచేరి వస్తుసామగ్రి తడిసిపోయింది.
చెట్లు పెళపెళ
200 కు పైగా చెట్లు కూలిపోయాయి, 400కు పైగా చెట్ల కొమ్మలు విరిగిపడటంతో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం కలగకపోవడం ఊరట కలిగించింది. చెట్లు కూలి విద్యుత్ స్తంభాలపై పడటంతో దెబ్బతిన్నాయి. అనేక లేఔట్లలో కరెంటు పోయి ప్రజలు రాత్రంతా చీకట్లోనే మగ్గారు. విజయనగర, ఆర్‌టీ.నగర, శేషాద్రిపురం, జయనగర, చామరాజపేటే, జేపీ.నగర, సదాశివనగర తో పాటు 50కి పైగా ప్రదేశాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు కూలాయి. పాలికె సిబ్బంది సగం సగం చెట్లను తొలగించి వెళుతున్నారని ప్రజలు ఆరోపించారు. వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. జీబీఏ, 5 నగర పాలికెల కంట్రోల్ రూమ్‌లకు సుమారు 800 కు పైగా ఫోన్ కాల్స్ సాయం కోరుతూ వచ్చాయి. సిబ్బంది, యంత్రాల కొరత ఏర్పడింది.
అకాల వర్షాలతో ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తచర్యలు చేపట్టాలని సీఎం సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. అండర్‌పాస్‌లు, డ్రైనేజీలు, రోడ్లపై వాననీరు నిలబడకుండా చూడాలన్నారు. చెట్లను ట్రిమ్మింగ్ చేయాలన్నారు. బెంగళూరుకు 3 రోజులు వర్షసూచన ఉంది. నగర పాలికెల సిబ్బందికి సెలవులు లేవని, విధుల్లో ఉండాలని జీబీఏ కమిషనర్ మహేశ్వర్‌రావ్ తెలిపారు.
వర్ష ప్రమాదాల్లో ముగ్గురు బలి
విధ్వంసంతో వణికించిన వరుణుడు
వందలాదిగా కూలిన చెట్లు, స్తంభాలు
కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం
లోతట్టు ప్రాంతాలు జలమయం
బెంగళూరులో ఫుట్‌పాత్ వ్యాపారాలు బంద్
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బనశంకరి: బెంగళూరులో అడుగుపెడితే చాలు ఎక్కడ చూసినా రోడ్లకు అటూ ఇటూ ఫుట్‌పాత్ వ్యాపారులు కనిపిస్తారు. బౌరింగ్ ఆస్పత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో 7 మంది చనిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విధానసౌధలో గోడ ప్రమాదం, అకాల వర్షాల సమస్యపై నగరాభివృద్ధి మంత్రి, డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ మాట్లాడారు. ఇకపై ఫుట్‌పాత్‌లపై ఎవరూ వ్యాపారం చేయరాదని తెలిపారు. గోడ కూలిన ఘటనలో అధికారులు నిర్లక్ష్యం ఉందని చెప్పలేమన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎత్తైన గోడలుఉ, ఆస్పత్రుల చుట్టుపక్క ప్రదేశాల్లో అసలు అనుమతించరాదని తెలిపారు. తక్షణం అన్ని ఆస్పత్రుల కట్టడాలు, కాంపౌండ్ల పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపారు.
సీఎం సమీక్ష
వర్ష ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. బౌరింగ్ ఆసుపత్రి గోడ కూలిన చోట సయ్యద్ సోఫియాస్ (17) కరెంటు తీగ తగలడంతో షాక్ కొట్టి చనిపోయాడు. కేజీ.హళ్లివాసి అయిన ఇతను బట్టలు కొనాలని తల్లితో కలిసి కమర్షియల్ స్ట్రీట్ కు వెళుతున్నారు. ప్రహరీ గోడ కూలిపోవడంతో కరెంటు స్తంభం తీగ తెగి అతనికి తగిలింది. కళ్ల ముందే కుమారుని మృతితో తల్లి స్పృహ తప్పి పడిపోయింది, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మైసూరు రోడ్డు కస్తూరిబాయి నగరలో సిమెంటు షీట్లు కూలి ఇంట్లో ఉన్న మంజు (35) మరణించాడు.
జేడీమర కూళగేరి నివాసి రఘు (35) అనే వ్యక్తి సారక్కి బస్టాప్‌లో కరెంటు పోల్ షాక్ కొట్టి చనిపోయాడు.


