యశవంతపుర: ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వధువును తీసుకురావడానికి కారులో వెళ్తూ ప్రమాదం జరిగి వరుడు మరణించాడు. ఈ ఘటన హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా మూగలి గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. బేలూరు తాలూకా లక్కుంద గ్రామం దర్బార్‌పేటకు చెందిన మను ఎల్‌ఎన్ (29), మే 10న కాంచన అనే యువతితో ఏడడుగులు నడవాల్సి ఉంది. వీరశైవ కళ్యాణ మండపాన్ని బుక్ చేశారు. రెండు కుటుంబాలూ పెళ్లి పనుల్లో ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసమని గురువారం ఉదయం మను కాంచనాను తీసుకురావాలని తొగరనహళ్లి గ్రామానికి కారులో బయలుదేరాడు. కారు మూగలి గ్రామం వద్ద అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జు కాగా, మను కారులో చిక్కుకుని ప్రాణాలను వదిలాడు. హఠాత్ మరణవార్తను విన్న రెండు కుటుంబాలు తీవ్ర వేదనలో మునిగిపోయాయి. పెళ్లి జరగాల్సిన ఇళ్లలో మౌనంగా ఆవహించింది.


