అన్న కుమారుడిని చంిపిన చిన్నాన్న | - | Sakshi
Sakshi News home page

అన్న కుమారుడిని చంిపిన చిన్నాన్న

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

రాయచూరు రూరల్‌: ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన ప్రమాదంలో సొంత అన్న భార్య వదినను హత్య చేయడానికి ముందుకు రాగా అడ్డుకున్న అన్న కుమారుడిని చిన్నాన్న చంిపిన ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. బుధవారం అలబనూరులో బసవరాజ్‌(39) అనే వ్యక్తి తన అన్న కుమారుడు నాగరాజ్‌(12)ను హత్య చేశాడు. బాలుడి తల్లి అమృత(42) తీవ్రంగా గాయపడింది. సిద్దప్ప నివాసానికి వెళ్లిన బసవరాజ్‌ అన్న కుమారుడైన నాగరాజ్‌ను చాకుతో పొడిచి హత్య చేశాడు. ధనుష్‌, అమృత పూర్తిగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రశేఖర్‌ పరిశీలించారు. నిందితుడు బసవరాజ్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆస్తుల పంపకాల్లో విభేదాలే కారణం

Advertisement
 
Advertisement
Advertisement