కూతుళ్లతో కలిసి బావిలోకి దూకిన తల్లి | - | Sakshi
Sakshi News home page

కూతుళ్లతో కలిసి బావిలోకి దూకిన తల్లి

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

కోలారు: భర్తతో కలహాల వల్ల ఓ తల్లి, ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా బి.కొరవనూరు గ్రామంలో జరిగింది. లక్ష్మీదేవమ్మ (35), పిల్లలు గగనశ్రీ (14), రెడ్డమ్మ (9) మృతులు. వివరాలు.. లక్ష్మీదేవమ్మకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు అరవింద్‌ ఉన్నారు. భర్త నారాయణప్ప ఏ పనీ చేయకుండా రోజూ తాగి వచ్చి వేధించే వాడని తెలిసింది. ఇల్లు గడవడం కూడా కష్టమైంది. దీంతో విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, అయితే ఆడపిల్లలు అనాథలవుతారనుకుని వారిని కూడా తీసుకుని ఊరిబయటకు వచ్చి ఓ బావిలోకి దూకింది. కొన్ని గంటల తరువాత కొందరు గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. అందరూ వచ్చి చూసేసరికి చనిపోయి ఉన్నారు. ముళబాగిలు రూరల్‌ పోలీసులు మృతదేహాలను బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువుల శోకాలు మిన్నంటాయి.

ముళబాగిలు వద్ద ఘోరం

Advertisement
 
Advertisement
Advertisement