దొడ్డబళ్లాపురం: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారి మీదకు మృత్యు శకటంలా ఓ కారు దూసుకొచ్చింది, ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. గదగ్ జల్లా లక్ష్మేశ్వరలో జరిగింది. బుధవారం ఉదయం రాణి చెన్నమ్మ కాలేజ్ వద్ద వాకింగ్ చేస్తున్న వారిపైకి ఓ కారు దూసుకెళ్లడంతో అశోక్ సర్వి (53), శివానంద హులుకోటి (57) అనే ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులని తెలిసింది. వీరితో పాటు వాకింగ్ చేస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతడు మహారాష్ట్ర నుంచి లక్ష్మేశ్వర్‌కు వచ్చాడని సమాచారం. అతడు నిద్రమత్తులో నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. వాకింగ్‌కు వెళ్లినవారు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
ఇద్దరు ఉపాధ్యాయుల మృతి, ఇద్దరికి గాయాలు
గదగ్ జిల్లాలో విషాద ఘటన


