బొమ్మనహళ్లి: గంజాయి మత్తులో బంగ్లాదేశ్‌కు చెందిన వలస కూలీలు రాత్రివేళ కిష్కింధకాండకు పాల్పడ్డారు. గొడవలు పడి గుడిసెలకు నిప్పు పెట్టుకుని విధ్వంసానికి దిగారు. దీంతో 10కిపైగా గుడిసెలు మంటల్లో చిక్కుకుని ఆందులో ఉన్న గ్యాస్‌సిలిండర్‌లు పెద్ద శబ్ధంతో పేలిపోవడంతో స్థానిక ప్రజలు ఏం జరిగిందోనని తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బెంగళూరు నగరంలోని బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోని హొసపాళ్య వార్డు పరిధిలో ఉన్న సామసంద్రపాళ్యలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది.
ఏం జరిగిందంటే..
గుడిసెలలో బంగ్లా వలస కూలీలు నివసిస్తూ చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తున్నారు. ఎప్పుడూ గంజాయి సేవిస్తూ, స్థానికులకు ఇబ్బందులు కలిగించేవారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఉండటంతో చాలామంది ఓటు వేయడానికి వెళ్లారు. ఈ సమయంలో వారిలో వారు గంజాయి మత్తులో దాడులకు దిగి గుడిసెలకు నిప్పు పెట్టుకోవడంతో రభస చెలరేగింది. సిలిండర్లు పేలి అగ్ని గోళాలు ఎగసిపడ్డాయి. స్థానిక యువకులు మంటలు అర్పే ప్రయత్నం చేసి, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఉదయం బొమ్మనహళ్ళి ఎమ్మెల్యే ఎం.సతీష్‌రెడ్డి పరిశీలించి, డీసీపీ ఎం.నారాయణ, పోలీసుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. అక్కడ పడి ఉన్న కొన్ని కార్డులను పరిశీలించగా బంగ్లాదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
బెంగళూరులో బంగ్లాదేశీల రచ్చ


