రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక మునుపే విత్తనాలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. రైతులు కూడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై రాయితీ పెంచినా కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. కంపెనీలు ఒక్కొక్క బస్తాకు రూ.75 నుంచి రూ.300 వరకు ధరలు పెంచాయి. గతంలో రూ.50 నుంచి రూ.100 వరకు పెంచారు. యూరియా, డీఏపీ మినహా ఇతర రకాల ఎరువుల ధరలు పొటాష్‌పై రూ.125 పెంచారు. మెట్ట భూముల్లో పత్తి, జొన్న, వేరుశనగ, కంది వేస్తుంటారు. రైతులు నత్రజని, భాస్వరం వంటి వాటి ధరలు అధికంగా విక్రయిస్తున్నారు. గత ఏడాది 1000 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయం కాగా ఈ ఏడాది 4000 మెట్రిక్ టన్నులను విక్రయించారు. మార్కెట్ ధరలు రూ.265 కాగా, నల్ల బజార్‌లో రూ.500 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి.
3.44 లక్షల హెక్టార్లలో విత్తన లక్ష్యం
ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. 84 వేల హెక్టార్లు నీటిపారుదల భూములు కాగా మిగిలిన హెక్టార్లలో ఏకదళ, ద్విదళ ధాన్యాలు, వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం ఉంది. జిల్లాలో 1.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉంది. కేఎస్‌ఎంఎఫ్‌లో 7393 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ దుకాణాల్లో 738.10 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉంది. 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉంది. ఖరీఫ్‌కు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ వెల్లడించారు. జిల్లాలోని 35 రైతు కేంద్రాల్లో రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందులు నిల్వ ఉన్నాయని తెలిపారు.
రాయచూరు తాలూకాలోని ఓ రైతు కేంద్రం వద్ద సమాలోచనలో రైతులు
ఖరీఫ్ కోసం ఓ గోదాములో నిల్వ ఉన్న వివిధ రకాల ఎరువుల బస్తాలు
విత్తనాలు, ఎరువుల కొరత ప్రారంభం
కాంప్లెక్స్ రకం ఎరువుల ధరలకు రెక్కలు


