ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

హొసపేటె: వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా తిప్పనాయకహళ్లి వద్ద జరిగింది. ఈ ఘటనలో తిప్పనాయకనహళ్లికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ప్రజ్వల్‌, బైక్‌ చోదకుడు గోణి బసప్ప(54) మృతి చెందారు. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా హొంబలగట్టి క్రాస్‌ నుంచి తిప్పనాయకనహళ్లి మీదుగా హరపనహళ్లి వైపునకు వేగంగా వెళుతున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో హరపనహళ్లి నుంచి తిప్పనాయకనహళ్లి గ్రామం వైపునకు ఎదురుగా వస్తున్న బైక్‌ను ట్రాక్టర్‌ బలంగా ఢీకొంది. బైక్‌పై స్వంత పని మీద వెళుతున్న భర్త గోణి బసప్ప తలకు బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావంతో స్థలంలోనే మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చొన్న భార్య ఉమాకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉమా దావణగెరె ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. హరపనహళ్లి డీఎస్పీ డాక్టర్‌ సంతోష్‌ చౌహాన్‌, సీఐ మహంతేష్‌ సజ్జన్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై అరసీకెరె పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మృతుడు గోణిబసప్ప

గాయపడిన ఉమా

Advertisement
 
Advertisement
Advertisement