హుబ్లీ: సీఎం మార్పు విషయం హైకమాండ్ చూసుకుంటుందని, ఈ విషయం గురించి ఎన్ని సార్లు అడిగినా తన వద్ద సమాధానం లేదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్ తెలిపారు. మంగళవారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండే నిర్ణయిస్తుందన్నారు. సీఎం, డీసీఎం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఆయన మాట్లాడుతూ అమిత్ షా, ఇతర బీజేపీ నేతలకు నమ్మకం ఉండేది జ్ఞానేశ్వర్‌కుమార్‌పైనే అని అన్నారు. మొన్న లోక్‌సభలో డీలిమినేషన్ బిల్లు వచ్చింది. జ్ఞానేశ్‌కుమార్ లోక్‌సభలో ఉండి ఉంటే అది కూడా పాస్ అయ్యేది. ఇప్పుడేమో 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుస్తారని అంటే ఆ క్రెడిట్ అంతా జ్ఞానేష్‌కుమార్‌కే దక్కుతుందన్నారు.
మాకే గెలుపు అవకాశాలు
మేం డీఎంకేతో కలిసి తమిళనాడులో గెలుస్తాం. కేరళలో యూడీఎఫ్‌తో కలిసి విజయం సాధిస్తాం. పశ్చిమ బెంగాల్ టీఎంసీ గెలుస్తుంది. కాంగ్రెస్ అస్సాంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫలితాలు ఏం అవుతాయో వేచి చూడాలన్నారు. ఆప్ ఎంపీల బీజేపీలో చేరికపై ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కమల కాదది, వాషింగ్ పౌడర్ నిర్మ అని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీకి వాషింగ్ మిషన్ ఉంది. గతంలో వాషింగ్ పౌడర్ నిర్మ నిమప్ప మాడిద కర్మ అని తమాషా చేసేవారం. ఏవైనా ఎత్తులు జిత్తులు వేసి బీజేపీలో చేరితే చాలు వాళ్లు 24 క్యారెట్ల బంగారం అయిపోతారు. ఇది బీజేపీ తంత్రం అని ఎద్దేవా చేశారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను తీసుకొని ఏం చేస్తారు? పంజాబ్ సర్కారు కూల్చివేతకు ప్రయత్నిస్తారని ఆరోపించారు.
మంత్రి సంతోష్‌లాడ్


