బనశంకరి: సిలికాన్ సిటీలో చిత్రకళా పరిషత్‌లో యూత్‌పొటోగ్రఫిక్ సొసైటీ సలాన్–2026 అంతర్జాతీయ ఛాయాచిత్ర ప్రదర్శన అట్టహాసంగా ముగిసింది. రెండురోజుల పాటు పరిషత్‌లో వందలాది ప్రతిభావంత ఛాయాచిత్ర గ్రాహకులు తీసిన ఉత్తమ చిత్రాల ప్రదర్శన కళాప్రియులకు కనువిందు చేసింది. దేశ విదేశాలలో అరుదైన, విభిన్న చాయాచిత్రాలు చూపరులను అబ్బురపరిచాయి. మానవ జీవితం, నగరాలు, పర్వతశ్రేణులు, ప్రకృతి అందాలు, అరుదైన వన్యజీవుల ఛాయాచిత్రాల ద్వారా వర్ధమాన ఫొటోగ్రాఫర్లు, ఆ రంగాల ఔత్సాహికులు అనేక మెళవకువలు తెలుసుకున్నట్లు చెప్పారు. పోలెండ్‌కు చెందిన గ్రెరోజ్ లీవండోవస్కీ, బెంగళూరుకు చెందిన సందీప్ దత్తరాజు, సింగపూర్ ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ దామోదరన్ ఉత్తమ ఫొటోగ్రాఫర్లుగా ఎంపికై నట్లు వైపీఎస్ ప్రతినిధులు అనిత మైసూరు, గిరీశ్‌అనంతమూర్తి, వీ.మంజువికాస్ శాస్త్రి తెలిపారు. ముఖ్య అతిథిగా టీవీ నటి పటాకి శృతి సందడి చేసింది.
చిత్రకళా పరిషత్‌లో ముగిసిన సలాన్ ప్రదర్శన


