మైసూరు: వైద్యుని కుమార్తె చిత్రాలను గ్రాఫిక్స్‌తో అశ్లీలంగా మార్చి అందరికీ పంపిస్తున్న దుండగుని ఉదంతమిది. ఈ మేరకు బాధిత తండ్రి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడు గత డిసెంబరులో తాను, తన కుమార్తె, అల్లుడు తదితరులకు ఆ అశ్లీల చిత్రాలను ఈమెయిల్ చేశాడని తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ 3న, అవే ఫోటోలు మైసూరులోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి కూడా వెళ్లాయి. ఫోటోలను అందరికీ పంపుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కలబుర్గిలో కామాంధ వార్డెన్
దొడ్డబళ్లాపురం: అర్ధరాత్రి విద్యార్థినులకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతూ నగ్న ఫోటోలు పంపించాలని సతాయిస్తున్న హాస్టల్ వార్డెన్ ఘనకార్యమిది. కలబుర్గి జిల్లా అఫ్జల్‌పురలోని బీసీఎం హాస్టల్‌లో వార్డెన్ హనుమంత బిరాదారపై ఈ మేరకు కేసు నమోదైంది. అర్ధరాత్రి వేళ నగ్న ఫోటోలు, స్నానం చేసే దృశ్యాలు పంపించాలని, అలా చేస్తే విహారయాత్రలకు తీసుకువెళ్తానని ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తున్నాడని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


