బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కులాల జాబితాలోని సముదాయాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్గీకరణ ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జస్టిస్ హెచ్‌ఎన్ నాగమోహన్‌దాస్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీలలో మొత్తం 101 జాతులను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజన చేసి ప్రస్తుతం 17 శాతం ఉన్న రిజర్వేషన్‌ను కేటాయించారు. జనసంఖ్యను బట్టి మిగతా సముదాయాలకు 6, 5 శాతం చొప్పున కల్పించారు. వర్గీకరణ ప్రక్రియ వల్ల నిలిపివేసిన ఉద్యోగ నియామకాలను తక్షణం ప్రారంభించాలని ఆదేశించింది. నిరుద్యోగుల వయో పరిమితిని సడలించాలని తీర్మానించింది. ఈనేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ బెంగళూరులోని కేఏఎస్‌ల సంఘం ఆఫీసులో సమావేశంలో పాల్గొన్నారు.


