రాయచూరు రూరల్: నగరంలో వాసవీ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు ఆదివారం రాత్రి తెరదించారు.
నగరేశ్వర దేవస్థానంలో ఆర్యవైశ్య సభ్యుల ఆధ్వర్యంలో దేవికి పూజలు, రథోత్సవం జరిగాయి. వాసవీ జయంతి సందర్భంగా వెండి, స్వర్ణ రథోత్సవాలను నెరవేర్చారు. నగరేశ్వర దేవస్థానం నుంచి వివిధ కూడళ్లలో దేవి విగ్రహాన్ని ఊరేగించారు. రథోత్సవాల్లో మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, ఆర్య వైశ్య సమాజం అధ్యక్షుడు పురుషోత్తం, పద్మరాజ్, జగదీష్, వీరేష్, వెంకణ్ణ, గోవిందు, పలుగుల నాగరాజ్, దత్తాత్రేయ, శ్రీనివాస్‌లున్నారు.


