సిలిండర్‌ పేలి ఇల్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ పేలి ఇల్లు ధ్వంసం

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

బళ్లారిఅర్బన్‌: జిల్లాలోని కంప్లి పట్టణంలోని 4వ వార్డులో ఆదివారం కాంగ్రెస్‌ కార్యకర్త యల్లప్పకు చెందిన ఇంటిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇంటికి తీవ్ర నష్టం సంభవించింది. పేలుడు తీవ్రతకు ఇంట్లోని సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో క్షణాల్లోనే మంటలు ఇంటిని ఆవరించాయి. ఇంటి పైకప్పు పూర్తిగా కాలిపోగా, లోపల ఉన్న ఫర్నిచర్‌, గృహోపకరణ, ఇతర వస్తువులు భస్మమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. కంప్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement