రాయచూరు రూరల్: సమాజంలో సమానత్వం, న్యాయం, మానవత విలువల కోసం పోరాడిన వ్యక్తి బసవేశ్వరుడని, బసవ తత్వాలు, ఆదర్శాలను అలవర్చుకోవాలని అఖిల భారత వీరశైవ సమాజం జాతీయ అధ్యక్షుడు, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అభిప్రాయ పడ్డారు. కలబుర్గి జిల్లా సేడంలోని మాతృఛాయ మైదానంలో బసవేశ్వరుడి 893వ జయంతి సంభ్రమాలను ప్రారంభించి మాట్లాడారు. బసవేశ్వరుడి అనుభవ మంటపాన్ని ఆధారంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులపై పార్లమెంట్‌ను ఏర్పాటు చేిసిన విషయాలను ప్రస్తావించారు. బసవేశ్వరుడి 893వ జయంతి సందర్భంగా 2,000 మందికి ఇష్టలింగ పూజలు చేశారు. 12వ కాలం నాటి బసవాది శరణుల వచనాలను భవిష్యత్ తరాల యువతీ యువకుల కోసం అనువదించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం, రాజకీయంగా ముందుకు రావడానికి అవకాశాలను కల్పించిన మహోన్నత వ్యక్తిగా ప్రస్తావించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, స్వామీజీలు, మాజీ శాసన సభ్యులు పాల్గొన్నారు.
మలేరియా నియంత్రణకు సహకరించండి
రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నియంత్రణకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ, మలేరియా వ్యాధి అధికారి షాకీర్ పిలుపునిచ్చారు. సోమవారం నగరసభలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, తాలూకా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, నగరసభల ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ జాతానుద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి గురించి వివరించాలన్నారు. ఇంటి పరిసరాల చుట్టు నీరు నిల్వ ఉండకుండా దాని నియంత్రణకు ముందుకు రావాలన్నారు. రక్త పరీక్షల ద్వారా వ్యాధిని కనుగొనడానికి వీలుంటుందన్నారు. సమావేశంలో అధికారులు చంద్రశేఖరయ్య, సంధ్య, జయపాల్ రెడ్డి, సరోజలున్నారు.
నారీ శక్తి బిల్లుపై సమర భేరి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన నారీ శక్తి వందన్ బిల్లును కాంగ్రెస్, ఇతర పార్టీలు తిరస్కరించడాన్ని ఖండిస్తూ బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆందోళన చేశారు. సోమవారం కొప్పళలోని గడియారం సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు దివ్యా అగ్ని మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తి వందన్ చట్టం పాస్ కాకుండా అడ్డుకోవడంతో ద్వారా మ హిళలను రాజకీయంగా అణగ దొక్కడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యమని ఆరోపించారు.


