జగమునేలు జగజ్జనని పాహిమాం | - | Sakshi
Sakshi News home page

జగమునేలు జగజ్జనని పాహిమాం

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

ఘనంగా వాసవీ మాత జయంతి

రాయచూరు రూరల్‌: నగరంలో ఆదివారం వాసవీ మాత జయంతి ఘనంగా నిర్వహించారు. నగరేశ్వర దేవస్థానంలో ఆర్యవైశ్య సభ్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం చేపట్టారు. శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌ ఆర్యవైశ్యులతో కలసి వాసవీ మాతను పల్లకీలో ఊరేగించారు. వాసవీ జయంతి సందర్భంగా వెండి, స్వర్ణ రథోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం అధ్యక్షుడు పురుషోత్తం, పద్మరాజ్‌, జగదీష్‌, వీరేష్‌, వెంకణ్ణ, గోవిందు, దత్తాత్రేయ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న శోభాయాత్ర

సాక్షి, బళ్లారి: నగరంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం వాసవీ మాత జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. త్యాగమూర్తిగా, ధర్మరక్షకురాలిగా వాసవీ మాత చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. వాసవీ మాత బోధనలు నేటికి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్‌, ఆర్యవైశ్య సమాజ ప్రమఖులు పాల్గొన్నారు.

వాసవీ సర్కిల్‌కు శంకుస్థాపన

హొసపేటె: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో వాసవీ మాత జయంతి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. హంపీలో రోడ్డులోని మల్లిగె హోటల్‌ కూడలి వద్ద వాసవీ సర్కిల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్యవైశ్య సంఘం, రోటరీ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 38 మంది రక్తదానం చేశారు. ఉదయం మెయిన్‌ బజార్‌లోని నాగేశ్వర ఆలయం నుంచి వాసవీ అమ్మవారిని పూర్ణకుంభంతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సర్కిల్‌కు వాసవీ పేరు పెట్టడంలో కీలక పాత్ర పోషించిన రమేష్‌ గుప్తాను సన్మాంచారు. ముత్తయిదువుల ఆధ్వర్యంలో వాసవీ మాతకు మడిలక్కి సమర్పణ, తులాభార సేవ, కన్యకా పూజ, ఒక ధార్మిక సభ నిర్వహించారు. దాతలను, వివిధ రకాలుగా సేవలు అందించిన వారిని సన్మానించారు. సాయంత్రం వాసవీ దేవిని నగరంలో ఊరేగించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రహ్లాద్‌ భూపాల్‌, సంఘం కోశాధికారి కాకుబాల్‌ శ్రీనివాస్‌, సేవా సమితి అధ్యక్షుడు నరసింహ మూర్తి, వాసవీ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి

పల్లకీ సేవలో పాల్గొన్న ఆర్యవైశ్యులు

కలశాలతో

ఊరేగింపుగా వస్తున్న మహిళలు

Advertisement
 
Advertisement
Advertisement