మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై తప్పడు ప్రచారం వద్దు | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై తప్పడు ప్రచారం వద్దు

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

రాయచూరు రూరల్‌: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై తప్పడు ప్రచారం చేయవద్దని కొప్పళ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమరే గౌడ బయ్యపూర్‌ సూచించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్‌, ఇతర పార్టీలపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఆదివారం కొప్పళ్‌లో అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన అందోళనలో మాట్లాడారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్స్‌ బిల్లు ఆమోదం పొందలేదు. మహిళలను రాజకీయంగా అణగదొక్కడమే కాంగ్రెస్‌ పార్టి ఉద్దేశమని చెప్పడాన్ని ఖండించారు. పేరుకు మాత్రమే మహిళల రిజర్వేషన్‌ బిల్లు అంటూ నియోజకవర్గాల విభజన బిల్లు ప్రవేశపెట్టడంతో తిరస్కరించడం జరిగిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

సారూ.. బిల్లు చెల్లించండి

హుబ్లీ: హుబ్లీ తాలూకా బ్యాహట్టి మద్దతు ధర కేంద్రంలో 8 రోజులు పడిగాపులు కాసి పెసలు విక్రయించాం. నాలుగున్నర నెలలు అవుతున్న బిల్లులు చెల్లించ లేదు. సారూ.. బిల్లులు చెల్లించండి అని కోరితే మీరు విక్రయించిన పెసలు తీసుకెళ్లండి అంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని 74 మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విక్రయించిన పెసలను తిరిగి తీసుకెళ్లమంటున్న అధికారుల తీరుతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రైతులే ఒత్తిడి చేసి పెసలు విక్రయించారని సంబంధిత అధికారులు చెబుతుండటం విడ్డూరం. మేము అలాగే చేసి ఉంటే వారెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని రైతులు నిలదీశారు. ఏదో గందరగోళం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోనరెడ్డి ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిసింది. ఇక ఈ సమస్య జిల్లా యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది. మరో రెండు రోజుల్లో డబ్బు చెల్లించని పక్షంలో తీవ్రంగా పోరాటం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు.

ఆదర్శప్రాయుడు అంబేడ్కర్‌

రాయచూరు రూరల్‌: సమాజంలో సమానత్వం, నాయ్యం, మానవీయ మౌల్యాల కోసం పోరాడిన వ్యక్తి అంబేడ్కర్‌ అని మాజీ మంత్రి శివన గౌడ నాయక్‌ అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద అంబేడ్కర్‌, బీమా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రచనకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్‌, శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌, విరుపాక్షి, రాజు, సన్నీ, స్మిత, రవీంద్ర జాలదార్‌, హేమ తదితరులు పాల్గొన్నారు.

భోవి వడ్డెర సంఘం

జిల్లా కార్యవర్గం ఎన్నిక

బళ్లారి అర్బన్‌: నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో బళ్లారి జిల్లా భోవి వడ్డెర సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. భోవి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామాంజనేయులు మళ్లీ ఎన్నికయ్యారు. దొడ్డా రామన్న, ఎంటీ.మల్లేష్‌, మితిలేష్‌, బండిమోట్‌ గాదిలింగ, టివి.వెంకటేశులు, బండిహట్టి మహేష్‌, సిరుగుప్ప జే.ఈశ్వరప్ప రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ శేషన్న, డ్రగ్స్‌ శాఖకు చెందిన నాగరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. కుబేర, మించు శ్రీనివాస్‌, జలాల్‌ కుమార్‌, కువెంపు నగర్‌ రమేష్‌, కాటేగుడ్డ పవర్‌లైన్‌ వెంకట్‌ రామారెడ్డి, అల్లుకృష్ణ తమ్మి రామారెడ్డి, అల్లుకృష్ణ తమ్మి రామారెడ్డి కార్పొరేషన్‌ సభ్యులుగా ఎంపిక చేశారు. వి.రవి, విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రకాష్‌, ఇబ్రహీంపుర్‌ శ్రీనివాస్‌, బొబ్బకుంట గాదిలింగ, సోమసముద్రం రఘుతో పాటు సంగనకల్లు వెంకటేష్‌ సంఘం డైరెక్టర్లుగా ఎంపికై నట్లు అధ్యక్షుడు రామాంజనేయులు వెల్లడించారు.

వేణుగోపాల రథోత్సవం

శ్రీనివాసపురం: తాలూకాలోని కోడి చెరువు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం బ్రహ్మ రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా గత 8 రోజులుగా దేవాలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామివారి దేవాలయంలో మూల విగ్రహానికి పూజలు జరిపి తేరు ఉత్సవాన్ని ప్రారంభించారు. తేరు కదులుతుండగా భక్తులు దవనం, అరటిపండ్లు విసిరారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement