పేలిన డీజిల్‌ ట్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

పేలిన డీజిల్‌ ట్యాంక్‌

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

నలుగురికి తీవ్ర గాయాలు

హొసపేటె: మరమ్మతుల కోసం లారీని గ్యారేజీకి తీసుకెళ్లిన సమయంలో డీజిల్‌ ట్యాంక్‌ పేలింది. ఈ ఘటన ఆదివారం సండూరు తాలూకా చెన్నభసప్ప క్యాంపు వద్ద చోటుచేసుకుంది. లారీ డ్రైవర్‌, లారీ యజమాని, గ్యారేజ్‌ మెకానిక్‌కు కాలిన గాయాలయ్యాయి. లారీకి మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తూ డీజిల్‌ ట్యాంక్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్‌ ఆసుపత్రికి పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement