రాయచూరు రూరల్: నీటి కొరతతో ఉత్తర కర్ణాటకలో పుష్కరిణులు ఎండిన దాఖాలాలు లేవు. నిత్యం జలంతో కళకళాలాడుతుంటాయి. చాళుక్య రాజులు నిర్మించిన చారిత్రక పుణ్య ధార్మిక క్షేత్రాల్లో ఒక్కటైన మహకోటీశ్వర పుణ్యతీర్థం ప్రసిద్ధి చెందింది. మహకోటీశ్వర దేవాలయంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు రెండు తీర్థాలు ఉన్నాయి. తీవ్ర వర్షాభావంతో తాలుకాలోని చెరువులు, బావులు ఎండిపోయాయి. అయితే బాదామి బనశంకరిలోని రెండు పుష్కరిణుల్లో నీరు పుష్కలంగా ఉంది. 8 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు ఉన్న విష్ణు పుష్కరిణిలో భూగర్బ జలం నిరంతరం పారుతుంది. ఉత్తర దిక్కున చతుర్మఖ బహ్మ దేవాలయం, వాయవ్య దిక్కున ఈశ్వరుడి విగ్రహాలను దర్శించుకోవాలంటే ఈత కొట్టుక్కుంటూ వెళ్లాల్సిందే. చిన్న పుష్కరిణిని కాశీ హోండా అంటారు. చిన్న పుష్కరిణిలో పుణ్య స్నానం చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి మహకోటేశ్వర, మల్లికార్జున దేవాలయాలను దర్శించుకుంటారు.


