రాయచూరు రూరల్: జిల్లాలో బాల్య వివాహాలకు కళ్లెం వేయాలని అధికారులకు జిల్లాధికారి నితీష్ సూచించారు. తన కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లాలో బాలింతల మరణాల నియంత్రణ, స్కానింగ్ కేంద్రాలపై నిఘా, పోక్సో చట్టం, ఇతరత్ర అంశాలపై అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మహిళలపై దౌర్జన్యం కేసులు, వరకట్నపు వేధింపులు, బాల్య వివాహాలు వంటి అంశాలపై వివరాలు సేకరించాలన్నారు. 250 గ్రామాల్లో బాల్య వివాహాలు పూర్తి స్థాయిలో అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అరుణాంగ్షు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర కమిషనర్ జుబిన్ మహాపాత్రో, సంతోష్ రాణి, సురేంద్ర బాబు, నందిత, నవీన్ కుమార్‌లున్నారు.


